బుధవారం 03 జూన్ 2020
National - Apr 06, 2020 , 10:55:00

బీజేపీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు : జేపీ న‌డ్డా

బీజేపీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు : జేపీ న‌డ్డా

న్యూఢిల్లీ: బీజేపీ 40వ వ్య‌వ‌స్థాప‌క దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా  పార్టీ బీజేపీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు నా  శుభాకాంక్ష‌లు. ప్ర‌పంచంలోని పెద్ద పార్టీల్లో ఒక‌టైన బీజేపీ ప్ర‌జా సేవ‌కు అంకితం. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హమ్మారి నుంచి భార‌త్ ను కాపాడ‌టంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తున్నార‌ని జేపీ న‌డ్డా తెలిపారు.

పీఎం మోదీ నేతృత్వంలో భార‌త్ క‌రోనా సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని దేశ ప్ర‌జ‌లంతా ఆశాభావంతో ఉన్నార‌ని జేపీ న‌డ్డా పేర్కొన్నారు. అంత‌కుముందు జేపీ న‌డ్డా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర‌కార్యాల‌యంలో పార్టీ జెండా ఎగుర‌వేశారు. మ‌రోవైపు బీజేపీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo