గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 02:27:05

వాళ్లను అప్పుడే పాక్‌కు పంపించాల్సింది!

వాళ్లను అప్పుడే పాక్‌కు పంపించాల్సింది!
  • ముస్లింలపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

పాట్నా: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడే ముస్లింలందర్నీ పాకిస్థాన్‌కి పంపించి ఉండాల్సిందని.. అలా చేయకపోవడంతోనే ప్రస్తుతం మనం మూల్యం చెల్లించుకుంటున్నామని కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో గిరిరాజ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘స్వాతంత్య్రం కోసం మన పూర్వీకులు బ్రిటిషర్లతో పోరాడుతున్న సమయంలో ప్రత్యేక ముస్లిం దేశం కావాలంటూ జిన్నా ఒత్తిడి తెచ్చాడు. దానికి మన వాళ్లు  ఒప్పుకున్నారు. అప్పుడే గనుక ముస్లింలందరినీ పాకిస్థాన్‌కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొస్తే ఇప్పుడు ఈ(సీఏఏ తీసుకురావడం) ఇబ్బందులు ఎదుర్కొనే వారమే కాదు. ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నాం’ అని గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. కాగా, గిరిరాజ్‌ వ్యాఖ్యలను బీజేపీ మిత్రపక్షం లోక్‌ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఖండించారు. తమ పార్టీ నేత గనుక ఇలాంటి వ్యాఖ్యలు చేసినైట్లెతే చర్యలు తీసుకునే వాడినన్నారు. 


logo
>>>>>>