శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 01, 2021 , 18:30:44

పాక్‌ కస్టడీలో 319 మంది భారతీయులు

పాక్‌ కస్టడీలో 319 మంది భారతీయులు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ కస్టడీలో 319 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 270 మంది మత్స్యకారులు కాగా 49 మంది పౌరులు. అలాగే భారత్‌ కస్టడీలో 340 మంది పాకిస్థానీయులు ఉన్నారు. వీరిలో 263 మంది పౌర ఖైదీలు కాగా 77 మంది మత్స్యకారులు. తమ కస్టడీలో ఉన్న ఇరు దేశాలకు చెందిన వారి జాబితాలను భారత్‌, పాకిస్థాన్‌ శుక్రవారం ఇచ్చి పుచ్చుకున్నాయి. 2008 నాటి ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి 1, జూలై 1న తమ కస్టడీలో ఉన్న వారి జాబితాలను ఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని దౌత్య కార్యాలయాల ద్వారా ఇచ్చిపుచ్చుకుంటాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఈ మేరకు కస్టడీలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాలను భారత్‌, పాకిస్థాన్‌ దౌత్య అధికారులు పరస్పరం మార్చుకున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి