మంగళవారం 07 జూలై 2020
National - Jun 06, 2020 , 08:58:15

క‌రోనా పాజిటివ్‌.. ఇట‌లీని దాటేసిన ఇండియా

క‌రోనా పాజిటివ్‌.. ఇట‌లీని దాటేసిన ఇండియా

హైద‌రాబాద్‌:  భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసులు 2.35 ల‌క్ష‌లు దాటాయి.  దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య‌లో ఇట‌లీ దేశాన్ని భార‌త్ దాటేసింది. ఇక భార‌త్‌లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 6600గా ఉన్న‌ది. మే 1వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. వ‌ల‌స కూలీల త‌ర‌లింపు ప్ర‌క్రియ మొద‌లైన త‌ర్వాత‌.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన‌ట్లు డేటా చెబుతున్న‌ది. 

సుమారు 19 రాష్ట్రాల్లో క‌రోనా సోకిన కేసుల సంఖ్య నాలుగు అంకెల‌కు చేరుకున్న‌ది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ , ఉత్త‌ర్‌‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇట‌లీలో 2,34,531 మందికి వైర‌స్ సోక‌గా, భార‌త్ కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 2,36,117గా ఉన్న‌ది.logo