ఆదివారం 05 జూలై 2020
National - Jul 01, 2020 , 01:57:47

అందుబాటులోకి అతిపెద్ద కరోనా దవాఖాన

అందుబాటులోకి అతిపెద్ద కరోనా దవాఖాన

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రోగులకు చికిత్స అందించడానికి అతిపెద్ద దవాఖాన అందుబాటులోకి వచ్చింది. ఛత్తర్‌పూర్‌ ప్రాంతంలో 10,000 పడకల సామర్థ్యంతో నెలకొల్పిన ‘సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌' ఆదివారం ప్రారంభమైంది. అయితే ప్రస్తుతానికి 2,000 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ బుధవారం నుంచి మిగిలిన 8,000 పడకలు కూడా అందుబాటులోకి వస్తాయని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేస్తూ ప్రపంచంలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న అతిపెద్ద దవాఖానల్లో సర్దార్‌ పటేల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఒకటని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేస్తూ 10,000 పడకల సామర్థ్యం ఉన్న ఈ దవాఖాన ప్రారంభం కావడం వల్ల ఢిల్లీ ప్రజలకు గొప్ప ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఈ సెంటర్‌ పూర్తిగా ఐటీబీపీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పారు.


logo