సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 12:57:43

ప్ర‌పంచంలో 70 శాతం పులులు భార‌త్‌లోనే

ప్ర‌పంచంలో 70 శాతం పులులు భార‌త్‌లోనే

ఢిల్లీ : రేపు గ్లోబ‌ల్ టైగ‌ర్ డే 2020. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ నేడు నాల్గ‌వ ఆల్ ఇండియా టైగ‌ర్ ఎస్టిమేష‌న్‌-2018 నివేదిక‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప‌్ర‌పంచంలోని పులుల్లో 70 శాతం పులులు భార‌త‌దేశంలోనే ఉన్న‌ట్లు  తెలిపారు. 1973 లో భారతదేశంలో కేవలం 9 పులుల సంర‌క్ష‌ణ కేంద్రాలు మాత్ర‌మే ఉండేవ‌న్నారు. వీటి సంఖ్య ప్ర‌స్తుతం 50కి చేరింద‌న్నారు. అదేవిధంగా దేశంలో సుమారు 30 వేల ఏనుగులు, 500 సింహాలు ఉన్న‌ట్లు తెలిపారు. 

ప్రపంచ భూ వైశ్యాల్యంలో భార‌త్ కేవ‌లం 2.5 శాతం మాత్రమే క‌లిగి ఉన్న‌ప్ప‌టికి 8 శాతం జీవవైవిద్యాన్ని క‌లిగి ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ప్రపంచంలోని 13 దేశాలలో మాత్రమే పులులు కనిపిస్తున్నాయన్నారు. పులుల సంరక్షణలో పాలుపంచుకున్న వారికి శిక్షణ ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని జవదేకర్ అన్నారు. 2019లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని టైగర్ రేంజ్ దేశాల ప్రభుత్వాల అధిపతులు స‌మావేశ‌మ‌య్యారు. 2022 నాటికి పులుల సంఖ్య‌ను రెట్టింపు చేయాల‌న్న ప్ర‌క‌ట‌న‌పై సంత‌కాలు చేశారు.logo