e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News జూలై నుంచి రోజూ 70 ల‌క్ష‌ల వ్యాక్సినేష‌న్‌.. అప్పుడే..!

జూలై నుంచి రోజూ 70 ల‌క్ష‌ల వ్యాక్సినేష‌న్‌.. అప్పుడే..!

జూలై నుంచి రోజూ 70 ల‌క్ష‌ల వ్యాక్సినేష‌న్‌.. అప్పుడే..!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డానికి జూలై ఒక‌టో తేదీ నాటికి ప్ర‌తి రోజూ కోటి ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ వేయాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. జూలై నుంచి ప్ర‌తి రోజు క‌నీసం 70 ల‌క్ష‌ల మందికి టీకాలు వేయాల్సిన అవ‌స‌రం ఉందని బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ సీఎండీ సంజీవ్‌ బ‌జాజ్ చెప్పారు.

ఈ ఏడాది చివ‌రిక‌ల్లా యువ‌త‌కు వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తే ప‌రిస్థితిలో చాలా తేడా వ‌స్తుంద‌ని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అన్నారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఔష‌ధాల సేక‌ర‌ణ‌కు దేశీయ‌, విదేశీ అల‌యెన్స్ నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

క‌రోనా రెండో వేవ్‌లో కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని అన్నారు. తొలి ద‌శ‌లో ఆందోళ‌న మ‌ధ్య‌ గుర్తు తెలియ‌ని వైర‌స్‌తో పోరాడామ‌ని గుర్తు చేశారు. కానీ రెండో వేవ్‌లో ప‌రిస్థితి చాలా మారింద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌క‌పోవ‌చ్చున‌ని సంజీవ్ బ‌జాజ్ వెల్ల‌డించారు. అయితే, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

రెండో వేవ్‌లో ప‌రిస్థితి చాలా మెరుగ్గా ఉంద‌ని, అయితే, థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు చేప‌ట్టే స‌న్నాహాల‌పైనే భ‌విత‌వ్యం ఆధార‌ప‌డింద‌ని చెప్పారు. ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ఆర్బీఐ ముందు చూపుతో చాలా చేసింద‌న్నారు.

స‌మ‌స్య ఉన్న‌చోటే ప‌రిష్కారం క‌నుగొనాల‌ని సంజీవ్ బ‌జాజ్ వెల్ల‌డించారు. విశ్వాస క‌ల్ప‌న‌లో ఆర్బీఐ ముంద‌డుగు వేసింద‌ని చెప్పారు. వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లాల‌న్నారు.

క‌రోనాతో దెబ్బ‌తిన్న ఎంఎస్ఎంఈల కోసం అమ‌లు చేస్తున్న ఈసీఎల్జీఎస్ ప‌థ‌కాన్ని విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సంజీవ్ బ‌జాజ్ చెప్పారు. తొలి ద‌శ‌తో పోలిస్తే ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాలు క‌రోనా బారిన ప‌డ్డాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వారికి ఫుడ్ లేదా ఆదాయ మ‌ద్ద‌తు ప‌లుకాల‌ని కోరారు.

ఇవి కూడా చ‌దవండి:

కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు

N95 Mask ఉత‌కొచ్చా? ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మాస్క్ మార్చాలి?

ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..

టీకాల ఎగుమ‌తిపై భార‌త్ నిషేధం.. 91 దేశాల‌పై తీవ్ర ప్ర‌భావం

Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?

దేశంలో వ్యాక్సిన్‌కు కొర‌త లేదు: ఐసీఎమ్మార్‌

ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్

రూ 50,000 దిశ‌గా ప‌సిడి ప‌రుగు..రూ 73,000కు చేరువైన వెండి

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్

భారీ ఊర‌ట : కొవిడ్-19 నియంత్ర‌ణ‌లు పూర్తిగా ఎత్తివేత‌!

సోష‌ల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్‌తో ఆధార్ లింక్

పైపైకి బంగారం.. డిసెంబ‌ర్‌క‌ల్లా రూ.57 వేల‌కు..!!

చిప్ స‌ప్ల‌యి కొర‌త‌: ఇప్ప‌ట్లో తేల‌డం క‌ష్ట‌మే: ఇంటెల్

ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. స‌భ్యుల‌కు రెండో కోవిడ్ అడ్వాన్స్‌!

ట‌యోటా మిన‌హా.. పుంజుకున్న కార్ల‌ సేల్స్‌!!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూలై నుంచి రోజూ 70 ల‌క్ష‌ల వ్యాక్సినేష‌న్‌.. అప్పుడే..!

ట్రెండింగ్‌

Advertisement