సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 08:28:01

కర్తార్‌పూర్‌ వివాదం.. పాక్‌ దౌత్యవేత్తకు సమన్లు

కర్తార్‌పూర్‌ వివాదం.. పాక్‌ దౌత్యవేత్తకు సమన్లు

న్యూఢిల్లీ: కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా నిర్వహణ బాధ్యతను సిక్కేతర సంస్థకు బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయంపై పాక్‌ హైకమిషన్‌లో దౌత్యాధికారికి భారత్ సమన్లు జారీచేసింది. ఈ మేరకు సీడీఏకు తీవ్ర నిరసన తెలిపింది. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. పాకిస్థాన్‌ సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ నుంచి కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా నిర్వహణ బాధ్యతను ఒక ప్రత్యేక ట్రస్ట్‌కు పాక్‌ అప్పగించింది. దీనిని ఖండిస్తున్నట్లు పాక్‌ దౌత్యాధికారికి తేల్చి చెప్పినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ చెప్పారు. ఇది కర్తార్‌పూర్‌ కారిడార్‌ స్ఫూర్తికి, సిక్కుల మనోభావాలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు.