మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 02, 2020 , 10:59:00

ఇవి మోదీ సృష్టించిన విధ్వంసాలు..

ఇవి మోదీ సృష్టించిన విధ్వంసాలు..

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై రాహుల్ గాంధీ త‌న అటాక్ కొన‌సాగిస్తున్నారు.  మోదీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఇవాళ ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. మోదీ ప్ర‌యోజిత విధ్వంసాల‌తో దేశం స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ద‌ని రాహుల్ త‌న ట్వీట్‌లో ఆరోపించారు.  మోదీ పాల‌న వ‌ల్ల దేశంలో జీడీపీ చ‌రిత్రాత్మ‌క స్థాయి(-23)కి ప‌డిపోయింద‌న్నారు.  45 ఏళ్ల‌లో ఎన్న‌డూలేనంత ఎక్కువ స్థాయికి నిరుద్యోగం పెరిగింద‌ని రాహుల్ విమ‌ర్శించారు. సుమారు 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయిన‌ట్లు చెప్పారు.  రాష్ట్రాల‌కు జీఎస్టీ కింద వ‌చ్చే వాటాను కేంద్రం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక సంఖ్య‌లో భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు విమ‌ర్శించారు.  మ‌న స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు, ఆక్ర‌మ‌ణ‌లు ఎక్కువ అయిన‌ట్లు రాహుల్ త‌న ట్వీట్‌లో మోదీపై ఆరోప‌ణ‌లు చేశారు.