మంగళవారం 02 మార్చి 2021
National - Jan 28, 2021 , 19:17:17

కొవిడ్‌ - 19 : రెండు రాష్ట్రాల్లోనే 67 శాతం కేసులు

కొవిడ్‌ - 19 : రెండు రాష్ట్రాల్లోనే 67 శాతం కేసులు

న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్‌-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే కేరళ, మహారాష్ట్రల్లో కరోనా క్రియాశీలక కేసులు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 67 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 1.7 లక్షల యాక్టివ్‌ కేసుల్లో కేవలం కేరళలోనే 42 శాతం కేసులు వెలుగుచూడగా, మహారాష్ట్ర తర్వాత స్ధానంలో నిలిచింది. కేరళలో 72,000 యాక్టివ్‌ కేసులు, మహారాష్ట్రలో  44,000 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఈ రెండు రాష్ట్రాల్లోనే మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 67 శాతం కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్ పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకున్న క్రమంలో ఐదో వంతు జిల్లాల్లో గత వారం రోజులుగా ఒక్క కరోనా వైరస్‌ కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం 11 రోజుల్లోనే 25 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. 

VIDEOS

logo