మంగళవారం 14 జూలై 2020
National - Jun 29, 2020 , 01:41:27

చైనాకు గట్టి జవాబిచ్చాం

చైనాకు గట్టి జవాబిచ్చాం

న్యూఢిల్లీ: లఢక్‌ భూభాగంపై కన్నేసిన వారికి (చైనా) భారత్‌ గట్టి సమాధానమిచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇతర దేశాలతో స్నేహపూర్వకంగా ఎలా మసులుకోవాలో, అదే సమయంలో విరోధులకు ఎలా జవాబివ్వాలో భారత్‌కు తెలుసని స్పష్టంచేశారు. ‘మన్‌కీబాత్‌' కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రధాని ఆదివారం ప్రసంగించారు. గల్వాన్‌ లోయ ఘటనలో ఇటీవల అమరులైన 20 మంది జవాన్లకు నివాళులు అర్పించారు. దేశ గౌరవానికి నష్టం కల్గించే ఎలాంటి చర్యలనైనా మన పరాక్రమవంతులైన సైనికులు అడ్డుకుంటారన్నారు. 

స్వావలంబన కోసం స్వదేశీ

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై విజయం సాధించడానికి ప్రజలు దృష్టి సారించాలని, ఇదే సమయంలో ఈ ‘అన్‌లాక్‌' దశలో ఆర్థికాభివృద్ధికి ఊతం కల్పించాలని కోరారు.


logo