శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 15:34:35

బంగ్లా‌దేశ్‌కు ప‌ది రైలు ఇంజ‌న్లు అంద‌జేసిన భార‌త్‌

బంగ్లా‌దేశ్‌కు ప‌ది రైలు ఇంజ‌న్లు అంద‌జేసిన భార‌త్‌

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు భార‌త్ ప‌ది రైలు ఇంజ‌న్లు అంద‌జేసింది. సోమ‌వారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్‌తో క‌లిసి కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్  వీటికి ప‌చ్చ‌జెండా ఊపారు. భార‌తీయ రైల్వే త‌యారు చేసిన అత్యాధునిక ప‌ది డీజిల్ రైలు ఇంజ‌న్ల‌ను ఇరు దేశాల అధికారుల స‌మ‌క్షంలో బంగ్లాదేశ్ రైల్వేకు అప్ప‌గించారు. ప‌శ్చిమ‌ బెంగాల్ నాడియా జిల్లాలోని గేడే స్టేషన్ నుంచి బ‌య‌లుదేరిన ఈ రైలింజ్ల‌ను బంగ్లాదేశ్‌లోని ద‌ర్శ‌న్ స్టేషన్‌లో ఆ దేశ అధికారులు స్వీకరించారు. 

బంగ్లా‌దేశ్‌లోని 90 బ్రాడ్ గేజ్ రైలు ఇంజ‌న్ల‌లో 72 శాతం జీవిత‌కాలం ముగిశాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ నుంచి వీటిని స‌మ‌కూర్చేందుకు గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఆ దేశం ప్ర‌తిపాద‌న పంపింది. ఈ నేప‌థ్యంలో పొరుగు దేశాల‌కు ప్రాధాన్య‌త కార్య‌క్ర‌మంలో భాగంగా భార‌త్ ప‌ది రైలు ఇంజ‌న్ల‌ను బంగ్లాదేశ్‌కు సోమ‌వారం అంద‌జేసింది. 3300 హార్స్‌ప‌వ‌ర్ సా‌మ‌ర్థ్య‌మున్న ఈ డీజిల్  రైలు ఇంజ‌న్లు 120 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌వు. మైక్రోప్రోసెస‌ర్ ఆధారిత నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ ఉన్న వీటిని ప్ర‌యాణికుల రైళ్ల‌తోపాటు స‌ర‌కు ర‌వాణాకు వినియోగించుకోవ‌చ్చు. ఈ రైలు ఇంజ‌న్ల జీవిత కాలం 28 ఏండ్లు.  


logo