శనివారం 06 మార్చి 2021
National - Jan 25, 2021 , 11:18:22

హ‌ద్దు మీరిన చైనా సైనికులు.. తిప్పి కొట్టిన భార‌త జ‌వాన్లు

హ‌ద్దు మీరిన చైనా సైనికులు.. తిప్పి కొట్టిన భార‌త జ‌వాన్లు

న్యూఢిల్లీ:  చైనా మ‌రోసారి హ‌ద్దు మీర‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ దేశ సైనికులు ఇండియాలోకి చొచ్చుకు రావ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. భార‌త జ‌వాన్లు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ సిక్కింలోని నాకూ లాలో గ‌త వారం జ‌రిగింది. రెండు దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డంతో 20 మంది చైనా సైనికులు గాయ‌ప‌డిన‌ట్లు తెలిసింది. ఇటు న‌లుగురు భార‌త జ‌వాన్లు కూడా గాయ‌ప‌డిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సిక్కింలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయ‌ని తెలిపాయి. 

VIDEOS

logo