సోమవారం 01 జూన్ 2020
National - May 19, 2020 , 01:23:25

మహాతుఫాన్‌గా అంఫాన్‌

మహాతుఫాన్‌గా అంఫాన్‌

  • రేపు తీరం దాటే అవకాశం
  • ఒడిశా, బెంగాల్‌కు పొంచి ఉన్న ముప్పు
  • ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

న్యూఢిల్లీ/భువనేశ్వర్‌/కోల్‌కతా, మే 18: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంఫాన్‌' తుఫాన్‌.. మహాతుఫానుగా (సూపర్‌సైక్లోన్‌) మారినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిం ది. దీంతో గంటకు 200 కిమీవేగంతో పెనుగాలులు వీస్తున్నాయన్నది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. బుధవారం మధ్యాహ్నానికి ఇది అతి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడి, పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ సమయంలో గంటకు 180-190 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నది 

తుఫాన్‌పై మోదీ సమీక్ష

అంఫాన్‌ ప్రభావంపై ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం సమీక్షించారు. సురక్షిత ప్రాంతాలకు  ప్రజల తరలింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. సమావేశం తర్వాత ప్రధాని ట్వీట్‌చేస్తూ.. ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. తుఫాన్‌ పరిస్థితులను ఎదుర్కొ నేందుకు ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాం  నుంచి సుమారు 11 లక్షల మందిని తరలించేందుకు ఒడిశా చర్యలు చేపడుతున్నది. సైక్లోన్‌ వల్ల ఒక్క మరణం కూడా సంభవించకూడదని సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. బెంగాల్‌ ప్రభుత్వం తీర ప్రాంతాల జిల్లాలను అప్రమత్తం చేసింది. 1999లో ఒడిశాపై మహాతుఫాన్‌ విరుచుకుపడి దాదాపు 10వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత ఒడిశాపై విరుచుకు పడనున్న రెండవ మహా తుఫాన్‌ అంఫాన్‌ అని  అధికారులు తెలిపారు.


logo