గురువారం 16 జూలై 2020
National - Jun 18, 2020 , 13:11:48

ఇండియాకు కంగ్రాట్స్ చెప్పిన అమెరికా..

ఇండియాకు కంగ్రాట్స్ చెప్పిన అమెరికా..

హైద‌రాబాద్: ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో తాత్కాలిక స‌భ్య‌దేశంగా భార‌త్ ఎన్నికైంది. 193 దేశాలు ఉన్న యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో.. రెండేళ్ల పాటు భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ స‌భ్య‌దేశంగా ఉంటుంది. జూన్ 17వ తేదీ నుంచి భార‌త్‌కు ఆ హోదా ద‌క్కింది. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లికి ఎన్నికైన భార‌త్‌కు.. అగ్ర‌రాజ్యం అమెరికా కంగ్రాట్స్ చెప్పింది. భార‌త్‌లో ఉన్న అమెరికా అంబాసిడ‌ర్ కెన్ జెస్ట‌ర్ దీనిపై స్పందించారు. యూఎన్‌కు ఎన్నికైన భార‌త్‌కు హృద‌యపూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రింత స్థిర‌మైన‌, భ‌ద్ర‌మైన‌, దేదీప్య‌మాన భ‌విష‌త్తు కోసం భార‌త్‌తో క‌లిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కెన్ జెస్ట‌ర్ తెలిపారు. 

ఐక్యరాజ్య‌స‌మితి ఎన్నిక‌లో స‌హ‌క‌రించిన ప్ర‌తి దేశానికి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ థ్యాంక్స్ చెప్పారు.  ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో.. ప్ర‌పంచ దేశాల బ‌లోపేతానికి భార‌త్ క‌ట్టుబ‌డి ప‌నిచేస్తుంద‌ని రాజ్‌నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. భ‌ద్ర‌తా మండ‌లి ఓటింగ్‌లో మొత్తం 192 దేశాలు పాల్గొన్నాయి. తాత్కాలిక స‌భ్య‌త్వం ద‌క్కాంటే, రెండింట మూడో వంత మెజారిటీ అవ‌స‌రం ఉటుంది. అంటే కేవ‌లం 128 ఓట్లు వ‌స్తే భార‌త్‌కు స‌రిపోతుంది. కానీ భార‌త్‌కు 184 ఓట్లు పోల‌య్యాయి. 

భార‌త్‌తో పాటు ఐర్లాండ్‌, మెక్సికో, నార్వే దేశాలు కూడా భ‌ద్ర‌తా మండ‌లి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాయి. భ‌ద్ర‌తా మండ‌లిలో చైనా, ఫ్రాన్స్‌, ర‌ష్యా, బ్రిట‌న్‌, అమెరికా.. శాశ్వ‌త స‌భ్య‌దేశాలుగా ఉన్నాయి.  2021-22 ట‌ర్మ్ కోసం ఆసియా ప‌సిఫిక్ ప్రాంతం నుంచి భార‌త్‌.. తాత్కాలిక స‌భ్య‌దేశంగా ఎన్నిక‌ల్లో నిలిచింది.  


logo