మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 27, 2020 , 14:00:18

స‌రిహ‌ద్దుల్లో భారీ యుద్ధ‌ట్యాంకుల‌ను మోహ‌రించిన భార‌త్‌

స‌రిహ‌ద్దుల్లో భారీ యుద్ధ‌ట్యాంకుల‌ను మోహ‌రించిన భార‌త్‌

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కోవ‌డానికి భార‌త్ సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే ల‌ఢక్‌లో అధునాత‌న రాఫెల్ యుద్ధ‌విమానా‌ల‌ను మోహ‌రించిన ఇండియ‌న్ ఆర్మీ, తాజాగా నియంత్ర‌ణ రేఖ సమీపంలోకి భారీ యుద్ధ ట్యాంక్‌ల‌ను త‌ర‌లించింది. వెంబ‌డి తూర్పు ల‌ఢక్‌లోని చుమ‌ర్-డెమ్చోక్‌లో మైన‌స్ 40 డిగ్రీల సెల్సీఎస్ వ‌ద్ద కూడా ప‌నిచేసే సామ‌ర్థ్య‌మున్న బీఎంపీ-2 వాహ‌నాల‌తోపాటు, అత్యంత శ‌క్తిమంత‌మైన టీ-90, టీ-72 యుద్ధ ట్యాంకుల‌ను మోహ‌రించింది. స‌రిహ‌ద్దుకు అవ‌త‌లివైపు చైనా టైప్ 15 ట్యాంకులతోపాటు భారీగా సైన్యాన్ని త‌ర‌లించింది. దీనికి ప్ర‌తిగా భార‌త్ కూడా త‌న బల‌గాల‌ను త‌ర‌లిస్తున్న‌ది. 

భార‌త్‌-చైనా మ‌ధ్య గ‌త ఐదు నెల‌లుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. జూన్ నెల‌లో గ‌ల్వాన్ లోయ‌‌లో భార‌త సైనికుల‌పై మూకుమ్మ‌డిగా దాడికి పాల్ప‌ని చైనా బ‌ల‌గాలు, 20 మంది సైనికుల‌ను పొట్ట‌న‌పెట్ట‌కున్నది. దీంతో ఒక్క‌సారిగా ఇరుదేశాల మ‌ధ్య వాతావార‌ణం వేడెక్కింది. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన యుద్ధ‌క్షేత్రంపై ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు దేశాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.   ‌‌