దేశంలో 94 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. గత కొన్నిరోజులుగా 40 వేలకుపైగా నమోదవు తుండగా, ఇవాళ 38 వేల మంది కరోనా బారినపడ్డారు. నిన్నటికంటే 7 శాతం తక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 94 లక్షలు దాటాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 38,772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు 94,31,692కు చేరాయి. ఇందులో 4,46,952 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 88,47,600 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 1,37,139 మంది కరోనా వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 45,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 443 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
దేశంలో నిన్నటివరకు 14,03,79,976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇందులో నిన్న ఒక్కరోజే 8,76,173 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడించింది.
తాజావార్తలు
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..