శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 10:50:43

దేశంలో 88 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 88 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త ఇర‌వై రోజులుగా 50 వేల‌కు దిగువ‌న కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 44 వేల కేసులురాగా, తాజాగా అవి 41 వేల‌కు త‌గ్గాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 88 ల‌క్ష‌ల మార్కును దాటింది.  

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 41,100 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదవ‌గా, క‌రోనా వ‌ల్ల మ‌రో 447 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 88,14,579కి చేర‌గా, క‌రోనా మృతులు 1,29,635కు పెరిగారు. మొత్తం క‌రోనా కేసుల్లో 4,79,216 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 82,05,728 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. కాగా, నిన్న కొత్త‌గా 42,156 మంది బాధితులు మ‌హ‌మ్మారి బారినుంచి బ‌య‌ట‌ప‌డ‌గా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,503 త‌గ్గింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌క‌టించింది. 

దేశ‌వ్యాప్తంగా నిన్న‌టివ‌ర‌కు 12,48,36,819 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒక్క‌రోజే 8,05,589 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించారు.