సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 10:31:31

దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గతవారం రోజులుగా పాజిటివ్‌ కేసులు కొద్దీగా తగ్గిన శనివారం మళ్లీ 50వేలకుపైగా రికార్డయ్యాయి. తాజాగా 45,674 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 85లక్షల మార్క్‌ను దాటింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం సంఖ్య 85,07,754కు చేరిందని కేంద్రం పేర్కొంది. మరో 559 మంది మహమ్మారితో మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,26,121కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,12,665 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24గంటల్లో 49,082 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 78,68,968 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం ఒకే రోజు 11,94,487 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటి 11,77,36,791 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.