శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 17:21:20

కరోనా ఇండియా సమగ్ర సమాచారం...

కరోనా ఇండియా సమగ్ర సమాచారం...

హైదరాబాద్‌: ప్రపంచదేశాన్ని వణికిస్తున్న కరోనాపై ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం అధికారిక వెబ్‌ సైట్‌ ను ఏర్పాటు చేసింది. www.covid19india.org   పేరుతో ఉన్న వెబ్‌ సైట్‌ ద్వారా దేశంలో కరోనా వ్యాధి రోగుల సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం కరోనా కేసులు, నయమైన రోగులు, చనిపోయిన వారి వివరాలను ఇందులో పొందుపర్చారు. ప్రతి నాలుగు గంటలకు ఒక సారి సమాచారాన్ని ఆప్‌డేట్‌ చేయనున్నారు.

దీని ద్వారా ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. ఎంత మంది చనిపోయారనే దానిపై అధికారిక సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండనుంది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాటిని అరికట్టడానికి ఇలాంటి అధికారిక సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. దేశంలో ఇప్పటి వరకు 600 కేసులు నమోదు కాగా 10 మంది చనిపోయారు. 40 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. 550 మంది చికిత్స పొందుతున్నారు. 

దేశంలో కరోనా సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


logo