శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 10:53:58

భారత్‌లో కరోనా కేసులు 492..

భారత్‌లో కరోనా కేసులు 492..

హైదరాబాద్‌ : భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 8:45 గంటల వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అయితే 36 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు. ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ యువతి ఇటీవలే యూకే నుంచి వచ్చింది. కేరళలో అత్యధికంగా 95 కరోనా కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య 87కు చేరుకుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో దాదాపు అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. చాలా చోట్ల ప్రజలు తమ నివాసాలకే పరిమితం అవుతున్నారు. నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసేందుకు కుటుంబం నుంచి ఒక్కరే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దులను ఇప్పటికే పోలీసులు మూసేశారు. కరోనా కట్టడికి అన్ని రాష్ర్టాల సీఎంలు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


logo