శనివారం 04 జూలై 2020
National - Jun 20, 2020 , 20:03:52

ష్యోక్‌-గాల్వాన్‌ వంతెన నిర్మాణం పూర్తి

ష్యోక్‌-గాల్వాన్‌ వంతెన నిర్మాణం పూర్తి

న్యూఢిల్లీ : తూర్పు లడక్‌ ప్రాంతంలోని ష్యోక్‌-గాల్వాన్‌ నదుల సంగమ కేంద్రం వద్ద వ్యూహాత్మకంగా నిర్మించిన ముఖ్యమైన వంతెన నిర్మాణం పూర్తయినట్లు సైనికాధికారులు శనివారం తెలిపారు. ఈ వంతెన పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 ట్రాక్‌ పరిధిలోకి రాదని వారు పేర్కొన్నారు. వంతెనను ష్యోక్‌ నదిపై ష్యోక్‌-గాల్వాన్‌ నది సంగమ ప్రాంతానికి దగ్గర నిర్మించారు. 60మీటర్ల పొడవున్న ఈ వంతెన పైనుంచి ఆర్మీ వాహనాలు సులువుగా వెళ్లగలవు. గతంలో గాల్వాన్‌ నదిపై జవాన్లు కాలినడకన వెళ్లేందుకు మాత్రమే వంతెన ఉండేది. ఇప్పుడు వంతెన నిర్మాణం సైతం పూర్తవడంతో ఆ ప్రాంతంలో భారత బలగాల పహారా మరింత పెరిగే అవకాశముంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చైనా విఫలయత్నం చేసినా భారత్‌ వెనుక్కు తగ్గకుండా పూర్తి చేసింది. సరిహద్దులో అభివృద్ధి జరుగుతున్న సమయంలో గాల్వాన్‌ లోయలో ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఈనెల 15న రాత్రి గాల్వాన్‌ లోయలో భారత సైనికులు-చైనాదళాలకు మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. logo