ఇండియాలో ఉన్న టాప్ రైటర్లలో విజయేంద్రప్రసాద్ ఒకరు. దర్శకదిగ్గజం రాజమౌళి సినిమాలన్నింటికి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుంటారు. పాన్ ఇండియా స్థాయి తెలుగు సినిమాలతోపాటు ఇతర భాషల చిత్రాలకు కథలు రాస్తూ బిజీ షెడ్యూల్ లో ఉంటారు విజయేంద్ర ప్రసాద్. ఈ స్టార్ రైటర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అప్ డేట్ ఆడియెన్స్ కు అందించారు.
అందేంటో తెలుసా..? పవన్ కల్యాణ్ కోసం స్టోరీ సిద్దం చేశారని ఆయన చెప్పారు. అంతేకాదు పవన్ కల్యాణ్ ను కలిసి కథ కూడా వినిపించారట. పవన్ కల్యాణ్ కు స్క్రిప్ట్ ఇంప్రెసివ్ గా అనిపించడమే కాదు..తన పాత్ర కూడా బాగా నచ్చిందని ఇన్ సైడ్ టాక్. అయితే పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్-పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు..ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ కథనందించిన ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉంది. రెండు పాటలు మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందీ ప్రాజెక్టు.
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్