టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. రాచకొండ విద్యాసాగర్ డైరెక్షన్లో హెలేరియస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. బట్టతలతో బాధపడే గొట్టి సూర్యనారాయణ పాత్రలో కనిపించబోతున్నాడు అవసరాల.
చేతిలో టాయ్ పట్టుకుని ఓ వైపు విగ్గు పెట్టుకుని, మరోవైపు నున్నటి గుండుతో ఉన్న ఫస్ట్ లుక్ ఫన్ గా కనిపిస్తుంది.
త్వరలో టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
దిల్రాజు-క్రిష్ (డైరెక్టర్) సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్టు మే 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.