శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 07:06:56

భార‌త్.. ఆ ప‌ని 50 ఏండ్ల క్రిత‌మే చేసింది

భార‌త్.. ఆ ప‌ని 50 ఏండ్ల క్రిత‌మే చేసింది

న్యూఢిల్లీ: అమెరికాలో మొద‌టిసారిగా ఓ మ‌హిళ దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక‌య్యార‌‌ని, కానీ భార‌త్‌లో అది 50 ఏండ్ల క్రిత‌మే జ‌రిగింద‌ని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. నిన్న త‌న నాన‌మ్మ ఇందిరా గాంధీ 103వ‌ జ‌న్మదినం సంద‌ర్భంగా ఆమె నివాళుల‌ర్పించారు. 'అమెరికాకు ఇన్నాళ్ల త‌ర్వాత మొద‌టి మ‌హిళా ఉపాధ్యాక్షురాలిగా క‌మ‌ళా హారిస్ ఎన్నిక‌య్యారు. కానీ, భార‌త‌దేశం 50 ఏండ్ల క్రిత‌మే ఇందిరాగాంధీని మొద‌టి మ‌హిళా ప్ర‌ధానిగా ఎన్నుకుంది. ఇందిరా గాంధీ త‌న ధైర్య సాహ‌సాల‌తో ప్ర‌పంచంలో మ‌హిళ‌ల‌కు ఎప్పుడూ ప్రేర‌ణ‌గా నిలుస్తారు.' అని ట్వీట్ చేశారు.