సోమవారం 30 మార్చి 2020
National - Feb 14, 2020 , 14:12:58

హఫీజ్‌కు శిక్ష అమలవుతుందా?

హఫీజ్‌కు శిక్ష అమలవుతుందా?
  • భారత ప్రభుత్వ వర్గాల అనుమానం
  • ఎఫ్‌ఏటీఎఫ్‌ భేటీ నేపథ్యంలో పాక్‌ న్యాయస్థానం తీర్పు

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కుట్రదారు, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ న్యాయస్థానం విధించిన జైలుశిక్ష ఏ మేరకు అమలవుతుందో  వేచి చూడాలని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాదులకు నిధుల సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై రెండు వేర్వేరు కేసుల్లో ఐదున్నరేండ్ల జైలుశిక్ష విధిస్తూ పాక్‌లోని న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. మరో నాలుగు రోజుల్లో పారిస్‌లో అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ‘ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశం కానున్న నేపథ్యంలో హఫీజ్‌కు పాక్‌ కోర్టు జైలుశిక్ష విధించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ గతేడాది ఆదేశించింది. ఈ క్రమంలో పాక్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. 
logo