బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 19:59:23

తబ్లీగీ జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాలు రద్దు

తబ్లీగీ జమాత్‌కు హాజరైన విదేశీయుల వీసాలు రద్దు

ఢిల్లీ: తబ్లీగీ జామాత్‌ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను కేంద్రం బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం ట్విటర్‌ద్వారా తెలిపింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లీగీ కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వ గుర్తించింది. విదేశీయుల చట్టం -1946, విపత్తు నిర్వహణ చట్టం - 2005ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు, రాష్ర్టాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 


logo