గురువారం 28 మే 2020
National - May 07, 2020 , 11:29:18

ప్రారంభ‌మైన వందే భార‌త్ మిష‌న్‌...

ప్రారంభ‌మైన వందే భార‌త్ మిష‌న్‌...

ఢిల్లీ: వ‌ందే భార‌త్ మిష‌న్ ప్రారంభ‌మైంది. విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను మ‌న దేశానికి తీసుకురావ‌డానికి ఉద్దేశించిన మిష‌న్‌ను అధికారులు ప్రారంభించారు. 200 మంది ప్ర‌యాణికుల‌తో కూడిన మొద‌టి విమానం ఈ రోజు రాత్రి 9:45 గంట‌ల‌కు కొచ్చి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో దిగ‌నుంది. మొద‌టి రోజు  వివిధ దేశాల నుంచి 10 విమానాలు న‌డుపుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్‌, ముంబై, ఢిల్లీ, హైద‌రాబాద్‌, అహ్మ‌దాబాద్‌, శ్రీన‌గ‌ర్‌లో ఈ రోజు రాత్రి వ‌ర‌కు విమానాలు విదేశాల నుంచి చేరుకుంటాయి. వ్యాధి ల‌క్ష‌ణాలు లేనివారిని మాత్ర‌మే విమానంలోకి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు. స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసిజ‌ర్స్ నిబంధ‌న‌లు అనుస‌రించి విమానయాన సంస్థ‌లు త‌మ సిబ్బందికి, పైల‌ట్ల‌కు కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించాయి. గ‌ల్ఫ్ దేశాల నుంచి, మ‌లేషియా, యూకే, యూఎస్ దేశాల నుంచి మే 13వ తేదీ వ‌ర‌కు మొద‌టి ద‌శ‌లో 12 దేశాల నుంచి 15000 మంది భార‌తీయుల‌ను ఇండియాకు తీసుకురావ‌డం వందే భార‌త్ మిష‌న్ ల‌క్ష్యం. 


logo