మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 13:47:55

పెట్రోలింగ్ పాయింట్ 15 వ‌ద్ద చైనా ద‌ళాలు ఉప‌సంహ‌ర‌ణ‌

పెట్రోలింగ్ పాయింట్ 15 వ‌ద్ద చైనా ద‌ళాలు ఉప‌సంహ‌ర‌ణ‌

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో ఉన్న వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర పాయింట్ 15 నుంచి చైనా ద‌ళాల సంపూర్ణంగా వెన‌క్కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. రెండు దేశాలకు చెందిన ద‌ళాలు ఈ ప్రాంతం నుంచి వెన‌క్కి వెళ్లిన‌ట్లు భార‌త ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. చైనా ద‌ళాలు దాదాపు 2 కిలోమీట‌ర్ల వెన‌క్కి వెళ్లిన‌ట్లు ఆర్మీ పేర్కొన్న‌ది. జూన్ 15వ తేదీన పెట్రోలింగ్ పాయిట్ 14 వ‌ద్ద రెండు దేశాల‌కు చెందిన సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే జూన్ 30వ తేదీన క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌ల్లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. రెండు దేశాల‌కు చెందిన బ‌ల‌గాలు వివాదాస్ప‌ద ప్రాంతం నుంచి వెన‌క్కి వెళ్తున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo