గురువారం 02 జూలై 2020
National - Jun 22, 2020 , 11:41:02

ఎల్ఏసీ వ‌ద్ద‌ భార‌త్‌‌, చైనా మ‌ధ్య సైనిక చ‌ర్చ‌లు

ఎల్ఏసీ వ‌ద్ద‌ భార‌త్‌‌, చైనా మ‌ధ్య సైనిక చ‌ర్చ‌లు

హైద‌రాబాద్‌: ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో భార‌త‌, చైనా ద‌ళాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌న ఘ‌ట‌న తెలిసిందే. ఆ గొడ‌వ‌లో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. వివాదాస్ప‌దంగా మారిన వాస్త‌వాధీన రేఖ స‌రిహ‌ద్దు అంశంపై .. రెండు దేశాల సైనిక అధికారులు మ‌ళ్లీ చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల‌ మోల్డో వ‌ద్ద రెండు దేశాల‌కు చెందిన కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి అధికారుల స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దు వివాదంపై రెండు దేశాల అధికారులు చ‌ర్చించ‌నున్నారు. 

చైనా వైపున ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లోని చుసూల్ వైపున .. లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ స్థాయి స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిసింది. ఇదే ప్రాంతంలో జూన్ 6వ తేదీన సైనిక స‌మావేశం జ‌రిగింది.  ఆ స‌మావేశంలో సైనిక ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు.  కానీ జూన్ 15వ తేదీన చైనా సైనికులు చేసిన దాడిలో 20 మంది భార‌త జ‌వాన్లు మృతిచెందారు. టెంట్లు తీసివేయాల‌ని జూన్ 6వ తేదీన కుదుర్చుకున్న ఒప్పందాన్ని..  చైనా సైనికులు ఉల్లంఘించారు.  ఆ త‌ర్వాత అక్క‌డ‌కు వెళ్లిన భార‌తీయ సైన్యంపై చైనా పాశ‌వికంగా దాడి చేసింది. 


logo