బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 22:43:58

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్క‌రోజే ఇరు రాష్ట్రాల్లో ప‌దికి పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో ఆరు పాజిటివ్ రాగా, ఏపీలోనూ మ‌రో ఆరు కేసులు పెరిగాయి. తాజాగా తెలంగాణ‌లో నిజామాబాద్ జిల్లాలోని ఓ వ్యక్తికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఖిల్లా రోడ్డుకు చెందిన 60 ఏండ్ల వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ కాగా బాధితుడు ఈ నెల 12న ఢిల్లీ నుంచి వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. ఇక ఏపీలో తాజాగా గుంటూరులో 2, విజ‌య‌వాడ‌లో ఒక పాజిటివ్ కేసు న‌మోద‌యింది. అంత‌కుముందు ప్ర‌కాశం జిల్లాలో 2, కర్నూలులో ఒక కేసు న‌మోద‌యింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం బులిటెన్ విడుద‌ల చేసింది. అటు తెలంగాణ‌లోనూ ఇవాళ న‌మోద‌యిన కేసుల‌తో బాధితుల సంఖ్య 66కి చేరింది.


logo