శుక్రవారం 10 జూలై 2020
National - Jun 29, 2020 , 18:28:08

తమిళనాడులో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

తమిళనాడులో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

చెన్నై : తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ కొన్ని జిల్లాలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయినా కూడా కేసుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం నిబంధనలను ఎంత కఠినతరం చేసినా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గడిజిన 24 గంటల్లో తమిళనాడులో 3,949 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 62 మంది మరణించినట్లు సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 86,224కు చేరింది. అందులో 47,749 మంది డిశ్చార్జి కాగా 37,331 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు 1,141 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. కాగా ఈరోజు మొత్తం 30,005 మందికి టెస్టులు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 10,86,569 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు తెలియజేశారు. 


logo