బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 06:55:05

వరుసగా 20వ రోజూ పెరిగిన చమురు ధరలు

వరుసగా 20వ రోజూ పెరిగిన చమురు ధరలు

హైదరాబాద్‌: వాహన వినియోగదారులకు చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా 20వ రోజూ కూడా చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచాయి.

పెట్రోల్‌ లీటర్‌కు 21పైసలు, డీజిల్‌ లీటర్‌కు 17 పైసలు పెంచాయి. 20రోజుల్లో  పెట్రోల్‌ లీటర్‌కు రూ.8.93పైసలు, డీజిల్‌ లీటర్‌కు రూ.10.07పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 79.92 పైసలు, డీజిల్‌ ధర 80.02, చెన్నైలో పెట్రోల్‌ రూ. 83.18, డీజిల్‌ ధర రూ.77.29పైసలు పెరిగాయి.

కో‌ల్‌కతాలో  పెట్రోల్‌ లీటర్‌కు రూ. 81.61, డీజిల్‌ ధర రూ.75.18 పైసలు పెరిగాయి.  ముంబైలో పెట్రోల్‌ రూ. 86.70, డీజిల్‌ ధర రూ.78.34 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 82.96, డీజిల్‌ ధర రూ.78.19పైసలు పెరిగాయి. 


logo