సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 14:43:21

భారీగా పెరిగిన వంటగ్యాస్‌ ధర..

భారీగా పెరిగిన వంటగ్యాస్‌ ధర..

హైదరాబాద్‌: వంటగ్యాస్‌ ధర ఒక్కసారిగా భారీ మొత్తంలో పెరిగింది. దీంతో సామాన్యులపై అదనపు భారం పడనుంది. ఇప్పుడున్న ధర కన్నా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర 144.5 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరతో సిలిండర్‌ ధర రూ. 858.5కు చేరుకుంది. ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చే రాయితీ మొత్తం 153.86 రూపాయల నుంచి 291.48 రూపాయలు పెరగనుంది. సిలిండర్‌ ధర పెంపుతో వినియోగదారుడిపై అదనంగా 7 రూపాయల భారం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలు పెరగడంతోనే భారత్‌లో కూడా ధరలు పెరిగినట్లు సమాచారం. logo