మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 01:27:41

లాక్‌డౌన్‌లో పెరిగిన గృహహింస కేసులు

లాక్‌డౌన్‌లో పెరిగిన గృహహింస కేసులు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిల్లిపాది సంతోషానికి అలుపన్నదే లేకుండా పని చేస్తున్నా కూడా ఆమెపైన హింస మాత్రం ఆగలేదు. నిజానికి అంతకుముందు కంటే వేధింపులు ఎక్కువయ్యాయి. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా గృహహింస కేసులు పెరిగాయని జాతీయ మహిళా కమిషన్‌ తెలిపింది. గ్రీన్‌ జోన్లతో పోల్చితే లాక్‌డౌన్‌ కఠినంగా అమల్లో ఉన్న రెడ్‌జోన్లలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నది. అదే సమయంలో అత్యాచారం కేసులు తగ్గాయని తెలిపింది. ప్రజలు బయట తిరగకపోవడం, ప్రజా రవాణా లేకపోవడం ఇందుకు కారణాలని చెప్పింది. 


logo