ఆదివారం 12 జూలై 2020
National - Jun 16, 2020 , 01:11:23

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. వరుసగా తొమ్మిదో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచారు. పెట్రోల్‌ ధర లీటరుకు 48 పైసలు, డీజిల్‌ ధర లీటరుకు 23 పైసలు చొప్పున పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.76.26, డీజిల్‌ ధర రూ.74.26కు చేరుకున్నది. తాజా పెంపుతో కలిపి గత 9 రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.5, డీజిల్‌ ధర రూ.4.87 పెరిగింది. 


logo