సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 11:42:45

42 చోట్ల ఐటీ సోదాలు.. 2.37 కోట్ల న‌గ‌దు స్వాధీనం

42 చోట్ల ఐటీ సోదాలు..  2.37 కోట్ల న‌గ‌దు స్వాధీనం

హైద‌రాబాద్‌:  ఎంట్రీ ఆప‌రేట‌ర్ సంజ‌య్ జైన్‌, అత‌ని ల‌బ్ధిదారుల ఇండ్ల‌ల్లో ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.  ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌, హ‌ర్యానా, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో ఉన్న ఇండ్లు, కార్యాల‌యాల్లో ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి.  సుమారు 42 ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ది.  ఈ దాడుల్లో అధికారులు సుమారు 2.37 కోట్ల న‌గ‌దును,  2.89 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.   ఐటీ అధికారులు ఇంకా సోదాలు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది.

న‌కిలీ బిల్లుల ద్వారా ఎంట్రీ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న రాకెట్‌ను ఐటీ శాఖ అధికారులు నిన్న చేధించారు. దీనిలో భాగంగానే సీబీడీటీ అధికారులు ప‌లు రాష్ట్రాల్లోని 42 ప్రాంతాల్లో సోదాలు చేశారు.  సుమారు 500 కోట్ల విలువైన ఎంట్రీ డాక్యుమెంట్ల‌ను కూడా సీజ్ చేశారు.  17 బ్యాంకు లాక‌ర్ల నుంచి కోట్ల విలువైన న‌గుదు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు సీబీడీటీ అధికారులు చెప్పారు.