గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 16:25:05

స్పెషల్‌ రైళ్ళతో ఆదాయం రూ.69 కోట్లు...

స్పెషల్‌  రైళ్ళతో ఆదాయం రూ.69 కోట్లు...

గత ఐదు రోజుల్లో దాదాపు 3.5 లక్షల మంది ప్రయాణికులను రాజధాని స్పెషల్‌ రైళ్ళలో తీసుకెళ్లడం వల్ల భారతీయ రైల్వేకు రూ .69 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మే 12 నుంచి డిల్లీ నుంచి, దేశంలోని ఇతర ప్రధాన నగరాల మధ్య చిక్కుకుపోయిన ప్రజలను తీసుకెళ్లేందుకు రాజధాని ప్రత్యేక రైళ్ళను ప్రారంభించారు. మే 16 న ఈ రైళ్లలో మొత్తం 27,788 మంది ప్రయాణించగా, ఆదివారం ఈ సంఖ్య 30,127 కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు రాజధాని మార్గాల్లో నడిపిస్తూ ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తున్నారు రైల్వే అధికారులు.

అధికారుల లెక్కల ప్రకారం ఈ రోజు వరకు 1,87,827 టికెట్లు బుక్‌ చేయబడ్డాయి. ఈ ప్రత్యేక రైళ్ళలో మొత్తం 3,48,634 మంది ప్రయాణికులు ఇప్పటివరకు ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం ఛార్జీలు 69,33,67,735 రూపాయలు వసూలు చేసింది రైల్వే. మే 27 వరకు ఇరవై ఒక్క రైళ్లు నడుస్తాయి అని రైల్వే తెలిపింది.


logo