మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 19:04:19

అంబాలా ఎయిర్‌బేస్ ప్రాంతంలో హై అలెర్ట్‌

అంబాలా ఎయిర్‌బేస్ ప్రాంతంలో హై అలెర్ట్‌

చండీగ‌ఢ్‌: ఫ్రాన్స్‌ నుంచి భార‌త్‌కు బ‌య‌లుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధ‌వారం హ‌ర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు చేర‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. అంబాలా కంటోన్‌మెంట్ ప‌రిధిలోని నాలుగు గ్రామాల్లో 144 సెక్ష‌న్ విధించిన‌ట్లు అంబాలా ట్రాఫిక్ డీఎస్పీ మునీష్ సెహగల్ తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల‌ ల్యాండింగ్ సమయంలో  ఇంటి మిద్దెలు, డాబాల‌పై ప్ర‌జ‌లు గుమిగూడ‌టం, ఫోటోలు తీయ‌డంపై నిషేధం విధించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అలాగే అంబాలా కంటోన్‌మెంట్ ప్రాంతాన్ని డ్రోన్ ర‌హిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.logo