మంగళవారం 07 జూలై 2020
National - May 28, 2020 , 13:22:39

గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా.. ఇద్దరు మృతి

గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా.. ఇద్దరు మృతి

ముంబయి : మహారాష్ట్రను కరోనా వైరస్‌ గజగజ వణికిస్తోంది. ఆ రాష్ట్రంలో కరోనా వైరస్‌ పోలీసులపై పడగ విప్పింది. మహారాష్ట్ర పోలీసు విభాగంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు అధికమవుతున్నాయి. గత 24 గంటల్లో 131 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇద్దరు పోలీసులు కొవిడ్‌-19తో మృతి చెందారు. ఇప్పటి వరకు 2095 మంది పోలీసులకు కరోనా సోకింది. మృతుల సంఖ్య 22కు చేరింది. 897 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 56,948 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,897 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 17,918 మంది కోలుకున్నారు. రెండో స్థానంలో తమిళనాడు(18,545 పాజిటివ్‌ కేసులు), మూడో స్థానంలో ఢిల్లీ(15,257 పాజిటివ్‌ కేసులు) ఉంది.


logo