శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 20:07:10

తమిళనాడులో ఒకే రోజు కరోనాతో 97 మంది మృతి

తమిళనాడులో ఒకే రోజు కరోనాతో 97 మంది మృతి

చెన్నై : తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24గంటలో కొత్తగా 5,864 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే వైరస్‌ ప్రభావంతో 97 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ 5,864 కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,39,978కి చేరింది. ప్రస్తుతం 57,962 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం 5,295 మది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కాగా, తమిళనాడులో కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 21 వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించనుండగా మిగతా రోజుల్లో కొన్నింటికి సడలింపులు ఇచ్చారు. లాక్‌డౌన్‌ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.logo