శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 19:02:01

తమిళనాడులో కరోనాతో ఒకేరోజు 88 మంది మృతి

తమిళనాడులో కరోనాతో ఒకేరోజు 88 మంది మృతి

చెన్నై : తమిళనాడు రాష్ర్టంలో కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 88 మంది కరోనాతో మృతి చెందగా 6,972  కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,27,688కి చేరింది. ఇందులో 57,073 మంది కరోనా సోకి దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 1,66,956 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3,659 మంది కరోనాతో మృతి చెందారు. 


ఇదిలా ఉండగా దేశంలో గడిచిన 24 గంటల్లో 47,704 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 33,425 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ మంగళవారం తెలియజేసింది. logo