ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 19:31:15

‘వందే భారత్ మిషన్’ నాలుగో దశలో 1197 విమాన సర్వీసులు

‘వందే భారత్ మిషన్’ నాలుగో దశలో 1197 విమాన సర్వీసులు

న్యూఢిల్లీ: ‘వందే భారత్ మిషన్’ నాలుగో దశలో 1197 విమాన సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందులో 945 అంతర్జాతీయ, 252 ఫీడర్ విమానాలు ఉంటాయని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. ఎయిర్ ఇండియాతోపాటు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ విమానయాన సంస్థలు సేవలందిస్తాయని తెలిపారు. 29 విదేశాల నుంచి దేశంలోని 34 ఎయిర్‌పోర్టులకు విమాన సర్వీసులు నడుపుతాయని వివరించారు.

కరోనా నేపథ్యంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మూడు దశలు పూర్తికాగా త్వరలో నాలుగో దశ తరలింపు ప్రక్రియ ప్రారంభం‌కానున్నది.
logo