సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 16:34:37

45 రోజులుగా పెరుగుతున్న రిక‌వ‌రీ కేసులు..

45 రోజులుగా పెరుగుతున్న రిక‌వ‌రీ కేసులు..

హైద‌రాబాద్‌: కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గ‌త 45 రోజుల్లో దేశంలో కోవిడ్‌19 రిక‌వ‌రీ కేసులు పెరిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  మ‌రో వైపు యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గింద‌న్నారు. ఏపీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, యూపీ, క‌ర్నాట‌క‌, బెంగాల్‌, ఢిల్లీ, కేర‌ళ‌, మ‌హారాష్ట్రలో కోవిడ్ కేసులు 76.7 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డ త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు రాజేశ్ తెలిపారు. ఐసీయూ బెడ్‌ల‌ను పెంచిన‌ట్లు తెలిపారు.  టెస్టింగ్‌ల‌ను రెండింత‌లు చేశారు. ఒక‌వేళ ఎవ‌రికైనా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, వాళ్లు త‌క్ష‌ణ‌మే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు. టెస్టింగ్ చేయించుకునేందుకు వెనుకాడ‌రాద‌న్నారు.  

ఢిల్లీలో ఉన్న 4వేల కంటోన్మెంట్ ప్రాంతాల‌ను త‌నిఖీలు చేసేందుకు సిబ్బందిని పెంచుతున్న‌ట్లు ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ వెల్ల‌డించారు.  స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసిజ‌ర్ ప్ర‌కారం ఈ ప్ర‌క్రియ సాగుతుంద‌న్నారు.  జూన్ త‌ర్వాత స‌గ‌టును టెస్టింగ్ సంఖ్య పెరిగిన‌ట్లు చెప్పారు.  ఆగ‌స్టు మ‌ధ్య‌లో కోవిడ్ కేసులు త‌గ్గాయ‌న్నారు.  ఇక అక్టోబ‌ర్ నుంచి రికార్డు స్థాయిలో కేసులు త‌గ్గుతున్న‌ట్లు తెలిపారు. గ‌త 48 గంట‌ల్లో కొన్ని కేసుల‌ను మాత్ర‌మే డిటెక్ట్ చేశామ‌ని, కానీ ఇప్పుడే ఎటువంటి అంచ‌నాకు రాలేమ‌న్నారు.