సోమవారం 06 జూలై 2020
National - Jun 28, 2020 , 12:06:43

చైనా దూకుడుకు దీటుగా బ‌దులిచ్చాం: ప‌్ర‌ధాని

చైనా దూకుడుకు దీటుగా బ‌దులిచ్చాం: ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. గ‌ల్వాన్ లోయ‌లో చైనా బ‌ల‌గాల‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను ప్ర‌ధాని కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను ఫ‌ణంగా పెట్టారని పేర్కొన్నారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడిన ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశం స్వయం సమృద్ధి సాధించేలా పౌరులు చొరవచూపాలని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

స్థానిక‌ ఉత్పత్తుల వాడకానికే దేశ ప్ర‌జ‌లు మొగ్గుచూపాలని ప్ర‌ధాని మోదీ కోరారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ దేశం రక్షణ, సాంకేతిక రంగాల్లో బలోపేతమవుతున్న‌ద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం భారత్‌ పాటుపడుతున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌పంచ దేశాల‌తోపాటు దేశంలోనూ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ద‌ని, క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌తి ఒక్క‌ర‌ నియమాలను క‌చ్చితంగా పాటించాల‌ని, లేదంటే ప్రమాదంలో పడతామని ప్ర‌ధాని హెచ్చరించారు. 


logo