శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 17:24:18

ఆర్థిక దిద్దుబాటు మొదలుపెట్టిన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం

ఆర్థిక దిద్దుబాటు మొదలుపెట్టిన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం

రాయ్‌పూర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అన్నిరాష్ట్రాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కోనున్నాయి. ఆర్థిక సమస్యలను అందరికన్నా ముందుగానే పసిగట్టిన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం.. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకొనేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం  లేఖలు పంపింది. సాధారణ బడ్జెట్‌లో 30 శాతం మేర కోతలు విధిస్తున్నామని, 70 శాతమే ఖర్చు పెట్టుకోవచ్చునని ఆ లేఖలో ప్రభుత్వం స్పష్టంచేసింది. నిర్మాణంలో ఉన్న పనులను సాధ్యమైనంత వరకు పూర్తిచేసేందుకు ఆయా విభాగాలు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతేనేగానీ కొత్త  పనులు చేపట్టరాదని సూచించింది. రాష్ట్ర ఫైనాన్స్‌శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ అమితాబ్‌జైన్‌ ప్రకారం, ఈ ఏడాది అన్నివిభాగాలకు కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో రూ.95 వేల కోట్లు. ఇప్పుడు 30 శాతం  కోత  విధించడం  ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.25వేల  కోట్లు మిగులనున్నాయి.


logo