శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 11:04:51

ట్రాన్స్‌జెండర్లకు కొవిడ్‌ దవాఖానలో బెడ్ల రిజర్వ్‌.. దేశంలోనే మొదటిసారి

ట్రాన్స్‌జెండర్లకు కొవిడ్‌ దవాఖానలో బెడ్ల రిజర్వ్‌.. దేశంలోనే మొదటిసారి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ఓ సున్నితమైన, ఆలోచనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ కొవిడ్‌ దవాఖానలో ట్రాన్స్‌జెండర్లకు నాలుగు పడకలను కేటాయించారు. ఇప్పటివరకూ కొవిడ్ -19 బారినపడి ఓ ట్రాన్స్‌జెండర్‌ మహిళ మాత్రమే దవాఖానలో చేరారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, కోల్‌కతాలోని ఎంఆర్‌ బంగూర్‌ దవాఖానలోని పురుష, స్త్రీవార్డుల్లో ట్రాన్స్‌జెండర్‌ మేల్‌కు రెండు, ఫిమేల్‌కు రెండు బెడ్లను కేటాయించారు.   

‘ట్రాన్స్‌జెండర్లు కొంతమంది నన్ను ఈ విషయంపై సంప్రదించగా, నేను సీఎం మమతా బెనర్జీకి ప్రతిపాదించాను. ఆమె వెంటనే అంగీకరించారు. వెంటనే వారికి బెడ్లు కేటాయించారు. ఈ ఘనత మమతా బెనర్జీకే దక్కుతుంది.’ అని ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి చంద్రమా భట్టాచార్య తెలిపారు. లింగమార్పిడి వర్గాల కోసం రిజర్వు చేసిన పడకల సంఖ్యను పెంచేందుకు, ఇతర ప్రభుత్వ కొవిడ్‌ దవాఖానలకు దీన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది తమకు భరోసా కల్పించే విషయమని, ఇతర రాష్ట్రాలు తమకు ప్రాధాన్యమిస్తాయని భావిస్తున్నామని బెంగాల్‌లోని ట్రాన్స్‌జెండర్ / హిజ్రా అసోసియేషన్ అధ్యక్షులు రంజిత సిన్హా పేర్కొన్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo