బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 13:50:13

పట్టాలపైకి మరో 40 స్పెషల్‌ ట్రైన్స్‌

పట్టాలపైకి మరో 40 స్పెషల్‌ ట్రైన్స్‌

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కేంద్రం అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఇస్తున్న పలు సడలింపులతో రైల్వేశాఖ ప్రయాణికులకు ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 రైళ్లు నడుపుతోంది. వీటికి తోడు ఈ నెల 12 నుంచి మరో 80 రైళ్లను ప్రారంభించింది. తాజాగా మరో 40 ట్రైన్లను పట్టాలెక్కించనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఇవి క్లోన్ స్పెషల్ ట్రైన్స్ అని తెలిపింది రైల్వే. అంటే ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుస్తున్న రూట్లలో కొన్ని రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.

అందుకే డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో మాత్రమే కొత్తగా ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా పలు రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఇందులో పలు రైళ్లు తెలంగాణ, ఏపీ నుంచి నడవనున్నాయి. రైలు నంబరు 02787 సికింద్రాబాద్‌ - దానాపూర్‌ రైలు ఉదయం 07.30 బయలుదేరుతుంది. బల్లర్షా, నాగ్‌పూర్‌, ఇటార్సి, జబల్‌పూర్‌, కాట్ని, ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌లలో ఆగనుంది. 06509 రైలు నంబర్‌ బెంగళూరు నుంచి దానాపూర్‌ మధ్య నడవనుంది. ఈ రైలు విజయవాడ, వరంగల్‌లో మాత్రమే ఆగుతుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo