గురువారం 04 జూన్ 2020
National - May 22, 2020 , 17:52:31

కరోనా మరణాల రేటు 3 శాతమే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

కరోనా మరణాల రేటు 3 శాతమే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 135 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష మాత్రమే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ మరణాల రేటు 3 శాతం మాత్రమే ఉందని ఆయన చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ఆయన బాధ్యలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ముందుగానే సన్నద్ధమయ్యామని, విజయవంతంగా నిలువరించగలుగుతున్నామని చెప్పారు. దేశంలో కోలుకునేవారి సంఖ్య 40కి చేరిందని, కేసుల సంఖ్య రెట్టింపవడానికి 13 (డబులింగ్‌ రేట్‌) రోజులు పడుతుందన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సంక్షోభం నెలకొందని, ఇలాంటి సమయంలో తాను బాధ్యతలు స్వీకరిస్తున్నాని తెలిపారు. రానున్న రెండు దశాబ్దాల్లో అనేక ఆరోగ్య సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు అందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలన్నారు.  

ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్‌కు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గాబ్రెయాసిస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పాత్రలోకి ఆయను ఆహ్వానిస్తున్నామన్నారు.  


logo