బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 07:35:32

మీరు రోడ్డుపైకి వస్తే.. నేను మీ ఇంటికొస్తా..

మీరు రోడ్డుపైకి వస్తే.. నేను మీ ఇంటికొస్తా..

బెంగళూరు : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు స్వీయ నియంత్రణతో పాటు భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు పదేపదే చెబుతున్నారు. కానీ కొందరు వినిపించుకోవడం లేదు. యథేచ్చగా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. వాహనాలపై ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నారు. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్ణాటక పోలీసులు విస్తృతంగా, వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు నగేణహళ్లి చెక్‌పోస్టు వద్ద వినూత్నంగా ప్రచారం చేపట్టారు. మీరు ఒక వేళ రోడ్డుపైకి వస్తే.. నేను కూడా మీ ఇంటికి వస్తాను అని కరోనా వైరస్‌ను ఉద్దేశించి రోడ్డుపై రాశారు. ఇక ఆ నినాదంపై కరోనా బొమ్మను పెద్దగా గీశారు. ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే బెంగళూరు పోలీసులు అనుమతిస్తున్నారు. కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసులు 110కి చేరుకున్నారు. కర్ణాటకలో ఈ వైరస్‌ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. తొమ్మిది మంది కోలుకున్నారు.


logo